: ముగిసిన భూమన సీఐడీ విచారణ
తుని ఘటనలో వైఎస్సార్సీపీ నేత భూమన కరుణాకరరెడ్డి పాత్రపై సీఐడీ సుదీర్ఘంగా జరిపిన విచారణ ముగిసింది. సీఐడీ అధికారులు ఆయనకు పలు ప్రశ్నలు సంధించారు. ప్రధానంగా భూమన నుంచి ఆందోళనకారులకు నిధులు వెళ్లాయన్న కోణంలో సీఐడీ అధికారులు ప్రశ్నలు సంధించినట్టు తెలుస్తోంది. అలాగే ముద్రగడతో సంబంధాలపై కూడా ఆయనను ప్రశ్నించారు. తుని ఘటనలో ఎవరి హస్తముంది? అని కూడా ఆయనను ఆరాతీసినట్టు తెలుస్తోంది. అయితే సీఐడీ అధికారులు వేసిన ప్రశ్నలన్నింటికీ భూమన ఓపిగ్గా సమాధానం చెప్పారని సమాచారం. దీంతో విచారణ రేపటికి వాయిదా వేసినట్టు తెలిపారు.