: మద్యం తరలిస్తున్నాడంటూ వ్యక్తిని చెట్టుకి కట్టేసి చితికబాదిన గ్రామస్తులు


సంపూర్ణ మ‌ద్య‌పాన నిషేధం అమలులో ఉన్న బీహార్‌లో ఓ వ్యక్తి అక్ర‌మంగా మ‌ద్యాన్ని త‌ర‌లిస్తుండ‌డంతో బీహార్ వాసులు ఓ గ్రామంలో స‌ద‌రు వ్య‌క్తిని చిత‌క్కొట్టారు. మద్యం తరలిస్తుండ‌గా వ్య‌క్తిని మార్గ‌మధ్యంలో ఆపిన స్థానికులు అత‌డిపై పిడిగుద్దులు కురిపించారు. అనంత‌రం చెట్టుకి క‌ట్టేసి కొట్టారు. త‌న‌ను విడిచి పెట్టాల‌ని బాధితుడు ఎంత‌గా వేడుకుంటున్నా వారు ఆగ‌లేదు. చేతుల‌తో, క‌ర్ర‌తో అత‌డిని దారుణంగా కొట్టారు. ఈ ఘ‌ట‌న అంతా పోలీసుల ముందే జ‌ర‌గ‌డం గ‌మ‌నార్హం. తీవ్ర గాయాల‌పాల‌యిన బాధితుడు ప్ర‌స్తుతం ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న‌ట్లు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News