: తనపై దాడికి పాల్పడిన 13 మందిని కోర్టులో గుర్తించిన ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్!
ఎంఐఎం శాసనసభాపక్ష నేత, చంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీపై గతంలో హైదరాబాద్ పాతబస్తీలోని బార్కాస్ ప్రాంతంలో హత్యాయత్నం జరిగిన కేసులో ఈరోజు నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. కోర్టులో అక్బరుద్దీన్ వాంగ్మూలం ఇచ్చారు. అక్బరుద్దీన్‌పై హత్యాయత్నం చేసిన వారు కూడా కోర్టుకు వచ్చారు. న్యాయస్థానంలో అక్బరుద్దీన్ పాక్షిక వాంగ్మూలం ఇచ్చారు. తనపై దాడి జరిగిన తీరును ఆయన వివరించారు. దాడికి పాల్పడిన 13 మందిని కోర్టులో గుర్తించారు. అనంతరం కోర్టు కేసు విచారణను రేపటికి వాయిదా వేసింది. అక్బరుద్దీన్‌తో పాటు నిందితులు కోర్టుకు హాజరైన నేపథ్యంలో కోర్టు పరిసర ప్రాంతాల్లో ఈరోజు భారీ ఎత్తున పోలీసుల భద్రత కనిపించింది.