: లోకేష్ లేగదూడ, జగన్ పులి: ఆనం వివేకా


తెలుగుదేశం పార్టీ యువనేత లోకేష్ రాజకీయాల్లో లేగదూడ వంటివాడైతే, విపక్ష నేత జగన్ పులి అని టీడీపీ సీనియర్ నేత ఆనం వివేకానందరెడ్డి వ్యాఖ్యానించారు. కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన లోకేష్, ప్రజలకు సేవ చేయాలని బలంగా కోరుకుంటున్న నేతని అన్నారు. సంస్కారవంతుడు, వివేకవంతుడైన లోకేష్ టీడీపీని మరింత ముందుకు తీసుకెళ్లే సత్తా ఉన్న నేతని సర్టిఫికెట్ ఇచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు మంచి పాలకుడిగా పేరు వస్తున్నందునే జగన్ విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. నడి సముద్రంలో ఉన్న తన పార్టీని గట్టుకు చేర్చేందుకు ఆయన ఆఖరి పోరాటాన్ని చేస్తున్నారని, అయినా పార్టీ ఒడ్డుకు చేరే పరిస్థితి కనిపించడం లేదని అన్నారు. ఎండలు వచ్చినా, వానలు కురవకున్నా, పంటలు ఎండినా ప్రతి దానికి చంద్రబాబునాయుడే కారణమని విమర్శించడం విపక్షాలకు అలవాటై పోయిందని అన్నారు.

  • Loading...

More Telugu News