: సాక్షి మాలిక్ కాబోయే భర్త కూడా రెజ్లరే!... పూర్తి వివరాలు వెల్లడించిన సాక్షి సోదరుడు!


రియో ఒలింపిక్స్ భారత పతకాల ఖాతా తెరచిన మహిళా రెజ్లర్ సాక్షి మాలిక్ వివాహానికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడయ్యాయి. రియో నుంచి తిరిగి రాగానే తన పెళ్లి గురించి సంచలన ప్రకటన చేసిన సాక్షి... వరుడి వివరాలు మాత్రం వెల్లడించని విషయం తెలిసిందే. తాజాగా సాక్షి సోదరుడు సచిన్ ఈ వివరాలను వెల్లడించాడు. రెజ్లింగ్ లో సాక్షికి శిక్షణ ఇచ్చిన యువ రెజ్లర్ సత్యవర్త్ కదియాన్ తోనే ఆమె వివాహం జరగనుందని సచిన్ తెలిపాడు. సాక్షి రియోకు వెళ్లకముందే ఈ పెళ్లికి సంబంధించిన నిర్ణయం జరిగిపోయిందని కూడా అతడు పేర్కొన్నాడు. సత్యవర్త్ తండ్రి సత్యవన్ రోహతక్ లో నడుపుతున్న రెజ్లింగ్ అకాడెమీలోనే సాక్షి శిక్షణ తీసుకుందట. ఈ క్రమంలో శిక్షణ సమయంలోనే సాక్షి, సత్యవర్త్ ల పెళ్లికి అంకురార్పణ జరిగిందని సచిన్ చెప్పాడు. సాక్షి మాదిరే సత్యవర్త్ కూడా పలు అంతర్జాతీయ స్థాయి టోర్నమెంట్లలో పాలుపంచుకున్నాడు. గ్లాస్గోలో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో రజత పతకాన్ని సాధించిన సత్యవర్త్... ఆసియా క్రీడల్లోనూ కాంస్య పతకం సాధించాడట.

  • Loading...

More Telugu News