: అనుంగుడే అన్యాయం చేశాడట!... ఢిల్లీ బహిష్కృత మంత్రి కార్యదర్శి అరెస్ట్!


బాధ్యత కలిగిన మంత్రి పదవిలో ఉండి మహిళతో సరస సల్లాపాలు సాగిస్తూ వీడియోకు చిక్కిన ఢిల్లీ మంత్రి సందీప్ కుమార్... మంత్రి పదవితో పాటు ఆప్ ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా కోల్పోయారు. ఆ తర్వాత పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. ఈ కేసులో తాజాగా ఆయన వద్ద కార్యదర్శిగా పనిచేసిన ప్రవీణ్ కుమార్ ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సందీప్ కుమార్ ను ఇబ్బందుల్లోకి నెట్టిన సదరు సీడీని వెలుగులోకి తెచ్చిన ఆరోపణలతోనే ప్రవీణ్ కుమార్ ను అరెస్ట్ చేసినట్లు సమాచారం.

  • Loading...

More Telugu News