: ఆ చేప పొడవు ఐదున్నర అడుగులు.. పాలమూరు జిల్లాలో పట్టుబడిన ‘ములుగు చేప’
మహబూబ్నగర్ జిల్లాలో అరుదైన చేప ఒకటి పట్టుబడింది. జిల్లాలోని వడ్డేపల్లి మండలం పెద తాండ్రపాడు శివారులోని ఆర్డీఎస్ కాలువలో ఇది దొరికింది. గ్రామానికి చెందిన రైతు శంకర్ తన పొలానికి నీరు పెడుతున్న సమయంలో కాలువ తూము నుంచి ఇది బయటకు వచ్చింది. దాదాపు ఐదున్నర అడుగుల పొడవున్న దీనిని చూసిన శంకర్ తొలుత అది పాము అనుకుని భయపడ్డాడు. దానిని పరీక్షగా చూసిన అనంతరం పాము కాదని నిర్ణయించుకున్న తర్వాత తోటి రైతులతో కలిసి దానిని పట్టుకున్నారు. ఐదున్నర అడుగుల పొడవు, 15 కిలోల బరువున్న ఈ చేపను ‘ములుగు చేప’గా గుర్తించారు. ఇక అరుదైన ములుగు చేప దొరికిందన్న విషయం గ్రామస్తులకు తెలియడంతో దానిని చూసేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు.