: పోలీసంటే ఇలా ఉండాలి.. టేజర్ గన్ను తనపైనే పరీక్షించుకున్న డీజీపీ!
సోషల్ మీడియాలో హల్ చేస్తున్న ఓ వీడియోను చూసిన వారు పోలీసంటే ఇలా ఉండాలంటూ కామెంట్లు పెడుతున్నారు. ఆయన పేరు జావీద్ అహ్మద్. ఉత్తరప్రదేశ్ డీజీపీ. టేజర్ గన్ పనితీరును తనపైనే పరీక్షించుకున్న ఈ అధికారి ఇప్పుడు అందరికీ ఆదర్శప్రాయులయ్యారు. సాధారణంగా టేజర్ గన్ను కాస్త దూరంగా ఉండి పరిశీలిస్తారు. కానీ ఆయన స్వయంగా తనపైనే పరీక్షించుకుని అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. టేజర్ గన్ పనితీరును ప్రదర్శిస్తూ, తనపైనే దానిని ప్రయోగించుకోవడంతో ఆయన షాక్ కి గురై వెంటనే కిందపడ్డారు. దీంతో అక్కడున్నవారు ఆందోళన చెందారు. అయితే ఆ తర్వాత కాసేపటికే ఆయన నెమ్మదిగా లేచి చిరునవ్వులు చిందించారు. టేజర్ గన్ నుంచి వెలువడే ప్రమాద రహిత విద్యుత్ తరంగాలు ఎదుటి వ్యక్తిని షాక్కు గురిచేసి తాత్కాలికంగా అచేతన స్థితిలోకి నెట్టివేస్తాయి. కొన్ని క్షణాలలోనే తిరిగి సదరు వ్యక్తి చేతనస్థితికి వస్తాడు. డీజీపీ షాక్ వీడియోను ఐపీఎస్ అసోసియేషన్ ట్వీట్ చేయడంతో ఇది వైరల్ అయింది. పోలీసుల ప్రతిష్ఠను జావీద్ ఇనుమడింపజేశారని కొందరు రీట్వీట్ చేశారు.
Kudos to @Uppolice DGP @javeeddgpup for taking Taser shot on himself during a demo. Taser a nonlethal electroshock pic.twitter.com/7qJzxELRS0
— IPS Association (@IPS_Association) September 4, 2016