: మదర్ థెరెసాకు మరో గౌరవం కల్పించిన భారత ప్రభుత్వం


రోమ్ లోని వాటికన్ సిటీలోని సెయింట్ పీటర్స్ బసిలికాలో సెయింట్ హుడ్ పొందిన మదర్ థెరెస్సా జ్ఞాపకార్థం భారత ప్రభుత్వం ఆమె పేరిట తపాల స్టాంపును విడుదల చేసింది. ముంబైలోని డివైన్ ఛైల్డ్ హైస్కూల్ లో కేంద్ర సహాయ మంత్రి మనోజ్ సిన్హా ఈ స్టాంపులను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మిషనరీస్ ఆఫ్ ఛారిటీ ప్రతినిధులుగా బిషప్ ఆగ్నెలో గ్రాసియస్, సిస్టర్ రూబెల్లా హాజరయ్యారు. ఈ సందర్భంగా మదర్ థెరెస్సా పేరిట పోస్టల్ స్టాంపు విడుదల చేయడం గర్వంగా ఉందని తెలిపింది. ఈ స్టాంపును మదర్ కు సెయింట్ హుడ్ ప్రకటించిన రోజే విడుదల చేయడం మరింత ఆనందంగా ఉందని ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News