: నా భర్త తప్పు లేదు... ఇందులో ఆయనను ఇరికించారు: సందీప్ కుమార్ భార్య


ఢిల్లీ మాజీ మంత్రి సందీప్ కుమార్ కు ఆయన భార్య రీతూ కుమార్ అండగా నిలిచారు. తన భర్త అత్యాచార కేసుపై ఆమె మాట్లటాడుతూ, తన భర్త ఎలాంటి తప్పు చేయలేదని నమ్ముతున్నానని అన్నారు. కుట్ర పన్ని ఆయనను ఎవరో ఇందులో ఇరికించి ఉంటారని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. తన భర్తను విశ్వసిస్తున్నానని, ఆయనకు అండగా నిలబడతానని ఆమె తెలిపారు. కాగా, ఆప్ బహిష్కృత నేత, ఢిల్లీ మాజీ మంత్రి అయిన సందీప్‌ కుమార్‌ ఇద్దరు మహిళలతో అభ్యంతరకర పరిస్థితుల్లో ఉన్నట్టుగా ఓ వీడియో వెలుగుచూసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై సదరు వీడియోలో ఉన్న ఓ మహిళ, తాను రేషన్ కార్డు కోసం మంత్రి కార్యాలయానికి వెళ్లగా మత్తు మందు కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చారని, అపస్మారకస్థితిలో ఉండగా తనపై అత్యాచారం చేశారని పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఆయన ఢిల్లీ పోలీసులకు లొంగిపోయిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News