: తప్పు చేసిన పోలీసును పట్టిస్తే రూ. 29 లక్షలు బహుమతి ప్రకటించిన ఫిలిప్పీన్స్


ఫిలిప్పీన్స్ దేశాధ్యక్షుడిగా ఎన్నికైన తరువాత డ్రగ్స్ నివారణే ఏకైక లక్ష్యంగా కఠిన చర్యలు తీసుకుంటూ ముందుకు సాగుతున్న రోడ్రిగొ డుటెర్టే, మరో కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. డ్రగ్స్ మాఫియా వద్ద లంచాలు తీసుకుని పోలీసులు సహకరిస్తున్నారన్న విషయం వెల్లడైన తరువాత, పోలీసులు ఎవరైనా తప్పు చేయడాన్ని చూసిన ప్రజలు, వారిని పట్టిస్తే 2 మిలియన్ ఫిలిప్పీన్ పెసోలు (సుమారు రూ. 29 లక్షలు) బహుమతిగా ఇస్తామని చెప్పారు. మాదకద్రవ్యాలను ప్రోత్సహించేది ఎవరైనా వదిలిపెట్టబోమని హెచ్చరించారు. రోడ్రిగో నిర్ణయం అవినీతి పోలీసుల వెన్నులో వణుకు పుట్టిస్తుంటే, తమ అధ్యక్షుడి నిర్ణయంతో ప్రజలు పోలీసుల్లో తప్పులు చేసే వారిని వెతికే పనిలో పడ్డారు.

  • Loading...

More Telugu News