: 2019లోనూ మోదీనే ప్రధాని.. 70 శాతం మంది భారతీయుల ఓటు ఆయనకేనంటున్న సర్వే!


ప్రధాని నరేంద్రమోదీ పాలనపై ప్రజల్లో విశ్వాసం పెరుగుతోందా? వచ్చేసారి కూడా ఆయన పీఎంగా కొనసాగాలని కోరుకుంటున్నారా? అంటే అవుననే అంటోంది తాజా సర్వే. ‘2019లో భారతదేశ ప్రధాని’ అనే అంశంపై ‘యూత్ ఆఫ్ ద నేషన్’ పేరుతో నిర్వహించిన ఆన్‌లైన్ సర్వేలో మెజారిటీ ప్రజలు తిరిగి మోదీనే పీఎం కావాలని కోరుకున్నారు. న్యూస్ యాప్ ఇన్‌షార్ట్స్, మార్కెటింగ్ ఏజెన్సీ ఇప్సాస్ సంయుక్తంగా ఈ ఆన్‌లైన్ సర్వేను నిర్వహించాయి. 2019లో మోదీనే ప్రధానిగా చూడాలనుకుంటున్నట్టు 70 శాతం మంది ప్రజలు కోరుకున్నారు. తాము తిరిగి ఆయననే ప్రధానిగా ఎన్నుకుంటామని తెలిపారు. అలాగే 64 శాతం మంది మహిళలు కూడా మోదీకి మద్దతు పలికారు. ఈ సర్వేలో మొత్తం 63,141 మంది పాల్గొన్నారు. 70 శాతం మంది మోదీకి జైకొట్టగా 17 శాతం ‘నో’ అన్నారు. 13 శాతం తాము ఇంకా ఏ విషయం తేల్చుకోలేదని సమాధానమిచ్చారు.

  • Loading...

More Telugu News