: కశ్మీర్లో మళ్లీ ఉద్రిక్తత.. శ్రీనగర్‌లో యవకుడి మృతి.. రెచ్చిపోయిన ఆందోళనకారులు
కశ్మీర్లో ఆందోళనలు చల్లారడం లేదు. ఆందోళనకారులు రాళ్లు పట్టుకుని రోడ్లపైకి వస్తూనే ఉన్నారు. నిన్న జరిగిన అల్లర్లలో ఓ యువకుడు మృతి చెందాడు. దీంతో ఆందోళనకారులు మరింత రెచ్చిపోయారు. శ్రీనగర్‌లోని కొన్ని ప్రాంతాల్లో కర్ఫ్యూ కొనసాగుతున్నా లాల్‌చౌక్, విమానాశ్రయం రోడ్డును దిగ్బంధించేందుకు ఆందోళనకారులు ప్రయత్నించడంతో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. కాగా నిన్న ఆందోళనకారులు, భద్రతా దళాలకు మధ్య జరిగిన అల్లర్లలో 24 ఏళ్ల బాసిత్ అహ్మద్ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే అతడు చనిపోయినట్టు వైద్యులు తెలిపారు. కాగా 57వ రోజు కూడా శ్రీనగర్‌లో కర్ఫ్యూ కొనసాగింది. ఇప్పటి వరకు జరిగిన అల్లర్లలో 71 మంది మృతి చెందారు. హిజ్బుల్ ఉగ్రవాది బుర్హాన్ వనీ ఎన్కౌంటర్ తర్వాత కశ్మీర్లో అల్లర్లు చెలరేగిన సంగతి తెలిసిందే.