: హైదరాబాదులో తగ్గని మందుబాబులు... యువతులు సహా 146 మందిపై కేసులు
వారాంతాల్లో మద్యం సేవించి వాహనాలపై దూసుకెళ్లేవారిని అడ్డుకునేందుకు పోలీసులు ఎంతగా చర్యలు చేపట్టినా మందుబాబుల దూకుడు మాత్రం తగ్గడం లేదు. ఇటీవలి కాలంలో హైదరాబాదులో వారాంతాల్లో 10 నుంచి 20 మంది వరకూ మాత్రమే పట్టుబడుతుండగా, గత రాత్రి ఏకంగా 146 మంది మద్యం సేవించి వాహనాలు నడుపుతూ అడ్డంగా దొరికిపోయారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతంలో డ్రంకెన్ డ్రైవ్ నిర్వహించిన పోలీసులు, పలువురు యువతులు సహా 146 మందిపై కేసులు నమోదు చేశారు. తనిఖీల అనంతరం 60 కార్లు, 86 టూవీలర్లను స్వాధీనం చేసుకున్నామని, వీటిని నడుపుతున్న వారిపై కేసులు పెట్టామని పోలీసులు తెలిపారు. వీరికి కౌన్సెలింగ్ ఇచ్చి మంగళవారం నాడు కోర్టులో హాజరుపరచనున్నామని, ఇటీవలి కాలంలో ఇంతమంది ఒకేసారి పట్టుబడటం ఇదే తొలిసారని వివరించారు.