: విజయ్ మాల్యాపై ముంబయి కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ
బ్యాంకులకు కోట్లాది రూపాయల రుణాలను ఎగ్గొట్టి లండన్ లో తలదాచుకుంటున్న వ్యాపార దిగ్గజం విజయ్ మాల్యాపై ముంబయి కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. దాదాపు రూ.1000 కోట్ల మేర సేవా పన్ను ఎగవేత కేసులో మాల్యాపై ఈ వారెంట్ జారీ అయింది. కాగా, జీఎంఆర్ కు కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ ఇచ్చిన చెక్కుల బౌన్స్ కేసులో విజయ్ మాల్యాను దోషిగా తేలుస్తూ హైదరాబాద్ లోని ఎర్రమంజిల్ కోర్టు నిన్న తీర్పు నిచ్చింది.