: ‘లోఫర్’ విలన్ చరణ్ దీప్ నిశ్చితార్థం


‘లోఫర్’ చిత్రం విలన్ చరణ్ దీప్ నిశ్చితార్థం ఇటీవల జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను తన ఫేస్ బుక్ ఖాతా ద్వారా చరణ్ దీప్ పోస్ట్ చేశాడు. ఈ కార్యక్రమానికి తెలుగు సినీ హాస్య నటుడు అలీ, హీరో ఆది తదితరులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి హాజరై తమను ఆశీర్వదించిన వారందరికీ తన ధన్యవాదాలని చరణ్ దీప్ ఆ పోస్ట్ లో పేర్కొన్నాడు. కాగా, పలు తెలుగు, తమిళ, కన్నడ చిత్రాల్లో చరణ్ దీప్ ప్రస్తుతం నటిస్తున్నాడు.

  • Loading...

More Telugu News