: ‘మహాజన’ పాదయాత్ర చేపడతాం: తమ్మినేని వీరభద్రం
సామాజిక, సమగ్ర అభివృద్ధి సాధన కోసం వచ్చే ఏడాది ‘మహాజన’ పాదయాత్ర చేపడతామని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. వచ్చే ఏడాది అక్టోబర్ 15 నుంచి మార్చి 5వ తేదీ వరకు 3,500 కిలోమీటర్ల మేర సుదీర్ఘపాదయాత్ర చేపడతామన్నారు. సభలు, కళారూపాలు, సెమినార్ల ద్వారా ఈ పాదయాత్రకు విస్తృత ప్రచారం కల్పిస్తామన్నారు. సామాజిక శక్తులతో బలమైన ఉద్యమం నిర్మిస్తామని, రాష్ట్రంలో 92 శాతం ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అభివృద్ధి చెందకుండా రాష్ట్రం అభివృద్ధి చెందదన్నారు. తెలంగాణలో ప్రత్యామ్నాయ అభివృద్ధి నమూనాను ప్రజల ముందు ఉంచుతామని తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు.