: హైద‌రాబాద్‌లో 40 వేలకు పైగా గ‌ణేశుడి విగ్రహాలు ఏర్పాటయ్యే అవకాశం, పటిష్ట బందోబస్తు: సీపీ మ‌హేంద‌ర్‌రెడ్డి


రెండు రోజుల్లో హైదరాబాద్ నగరంలో వినాయక చవితి వేడుకలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రభుత్వం అందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. ఈ నేపథ్యంలో నగరంలో తీసుకుంటోన్న భద్రతా చర్యలపై హైదరాబాద్ సీపీ మహేందర్‌రెడ్డి ఈరోజు మీడియాతో మాట్లాడారు. న‌గ‌రంలో భారీ ఎత్తున‌ భద్రతా ఏర్పాట్లు చేశామని ఆయ‌న అన్నారు. హైద‌రాబాద్‌లో 40 వేలకు పైగా గ‌ణేశుడి విగ్రహాలు ఏర్పాటయ్యే అవకాశం ఉందని ఆయ‌న పేర్కొన్నారు. సీసీ కెమెరాల‌తో ప‌టిష్ట బందోబ‌స్తు ఏర్పాటు చేస్తున్న‌ట్లు సీపీ మ‌హేంద‌ర్‌రెడ్డి తెలిపారు. రహదారుల్లోను, వినాయక మండపాల ప‌రిస‌ర ప్రాంతాల్లోను సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, వాటిని కమాండ్‌ కంట్రోల్‌ రూంతో అనుసంధానం చేస్తామని ఆయ‌న చెప్పారు.

  • Loading...

More Telugu News