: ప్రత్యేకహోదాపై నా భార్యను కూడా ఒప్పించే ప్రయత్నం చేస్తున్నా: విష్ణుకుమార్ రాజు


‘ఏపీకి ప్రత్యేక హోదా సెంటిమెంట్ గా మారింది. ప్రత్యేకహోదాపై నా భార్యను కూడా ఒప్పించే ప్రయత్నం చేస్తున్నాను’ అని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అన్నారు. తాజా పరిస్థితులపై పదాధికారుల సమావేశంలో చర్చించామన్నారు. ఏపీ ప్రజలు త్వరలో మంచి వార్త వినబోతున్నారన్నారు. టీడీపీ రాజకీయ వ్యూహాల్లో దిట్ట అని, మా వ్యూహాలతో మేమూ ముందుకు వెళతామని, ప్యాకేజ్, హోదాపై చర్చించేందుకు త్వరలో ఢిల్లీకి వెళ్తామని, తమ వాదనను కూడా వినిపిస్తామని చెప్పారు. ప్రత్యేక హోదా పేరు లేకుండా మంచి ప్యాకేజ్ ఇవ్వబోతున్నామని విష్ణుకుమార్ రాజు చెప్పారు.

  • Loading...

More Telugu News