: శివాజీ..ఒళ్లు దగ్గర పెట్టుకో, సుజనా వ్యక్తిగత విషయాలు నీకెందుకు? : బుద్దా వెంకన్న
ఏపీకి ప్రత్యేక హోదా విషయమై టీడీపీ నేతలపై సినీ నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మండిపడ్డారు. ‘శివాజీ.. కేంద్రమంత్రి సుజనా చౌదరి వ్యక్తిగత విషయాలు నీకెందుకు? ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడు’ అంటూ ఆయన హెచ్చరించారు. కాపు నేతలు బొత్స సత్యనారాయణ, దర్శకుడు దాసరి నారాయణరావు, కాంగ్రెస్ నేత, సినీ నటుడు చిరంజీవి రాజకీయ నిరుద్యోగులని, వారు అధికారంలో ఉన్నప్పుడు ఏం వెలగబెట్టారో చెప్పాలని విమర్శించారు. ఈ సందర్భంగా ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డిపై కూడా ఆయన మండిపడ్డారు. చంద్రబాబుపై విమర్శలు చేస్తే కనుక రఘువీరాను ప్రజలు తరిమికొడతారని బుద్దా వెంకన్న హెచ్చరించారు.