: కర్నూలు జిల్లాలో పశువుల కాపరికి దొరికిన వజ్రం
పశువులు కాస్తున్న ఒక యువకుడికి లక్షల రూపాయలు విలువ చేసే వజ్రం లభించింది. ఈ సంఘటన కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరి గ్రామంలో జరిగింది. ఈ గ్రామానికి చెందిన ఒక యువకుడు జొన్నగిరి శివార్లలో పశువులు కాస్తుండగా ఈ వజ్రం అతనికి లభించింది. ఈ వజ్రాన్ని బహిరంగ వేలం వేయగా రూ.5.60 లక్షలకు ఒక వ్యాపారి సొంతం చేసుకున్న తెలుస్తోంది.