: మాల్యాపై ఈడీ కొరడా!... రూ.6,630 కోట్ల ఆస్తుల అటాచ్!


బ్యాంకులకు రుణాలు ఎగవేసి లండన్ చెక్కేసిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కొరడా ఝుళిపించింది. విచారణకు హాజరుకావాలన్న తన నోటీసులకు ససేమిరా అంటున్న మాల్యాకు ఇప్పటికే కోర్టు ద్వారా ఈడీ సమన్లు కూడా జారీ చేసింది. తాజాగా మాల్యాకు చెందిన దాదాపు రూ.6,630 కోట్ల విలువ చేసే ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. వీటిలో మాల్యాకు చెందిన విలాసవంతమైన ఫామ్ హౌస్ తో పాటు షాపింగ్ మాల్, పలు కంపెనీల్లోని ఆయన షేర్లు ఉన్నాయి.

  • Loading...

More Telugu News