: చిరంజీవిపై చలమలశెట్టి ఫైర్!... పదవిలో ఉండగా కాపులకు ఏం చేశారని ప్రశ్న!
కాంగ్రెస్ పార్టీ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవిపై ఏపీ కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామానుజయ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి పదవిలో ఉండగా చిరంజీవి కాపులకు ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. కాపులకు రిజర్వేషన్లు ఇచ్చేందుకు తమ ప్రభుత్వం యత్నిస్తుంటే... ప్రభుత్వంపై కాపు ఐక్యవేదిక నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆయన కొద్దిసేపటి క్రితం విశాఖలో మీడియాతో మాట్లాడిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేస్తున్న ముద్రగడకు మద్దతుగా నిలుస్తున్న చిరంజీవి కాపులకు అన్యాయం చేసే దిశగానే పయనిస్తున్నారని ఆయన ఆరోపించారు.