: ‘ప్యాకేజీ’ తీసుకుంటాం!... ‘హోదా’ కోసం పోరాడతాం!: డొక్కా కామెంట్


ఏపీకి కేంద్రం ఏమిస్తుందో చూద్దామంటూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు వ్యాఖ్యానిస్తే... ఆయన బాటలోనే ఆయన పార్టీకి చెందిన కీలక నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ కొద్దిసేపటి క్రితం మరింత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విజయవాడలో కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడిన ఆయన రాష్ట్రానికి కేంద్రం ఏమిస్తే దానిని తీసుకుని, ప్రత్యేక హోదా కోసం పోరు సాగిస్తామని చెప్పారు. ముందు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తే... దానిని వద్దనాల్సిన అవసరమేముందని ప్రశ్నించారు. ఇచ్చిన దానిని తిరస్కరిస్తే.. వస్తుందనుకున్న దానిపై ప్రభావం పడుతుందన్నారు. ఇచ్చిన దానిని తీసుకోకుండా రాని దాని కోసం పోరాటం చేస్తే నష్టం జరిగే ప్రమాదముందని ఆయన పేర్కొన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఎంత ముఖ్యమో, ప్రత్యేక ప్యాకేజీ కూడా అంతే ముఖ్యమని డొక్కా అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం అధికార పక్షంలో ఉండి కూడా విపక్షాల కంటే దీటుగా తమ పార్టీకి చెందిన కేంద్ర మంత్రులు, ఎంపీలు పోరు సాగిస్తున్నారని ఆయన చెప్పుకొచ్చారు.

  • Loading...

More Telugu News