: ఒకేసారి 25 పరోటాలు లాగిస్తే రూ.5,001 బహుమతి ఇస్తారట!


వినాయ‌క చ‌వితి సంద‌ర్భంగా తమిళనాడు, కోయంబత్తూర్ సిటీలోని అన్నూర్‌ గణేశపురంలోని ఓ హోటల్ ప‌రోటా ప్రియుల క‌డుపునింపి వారి చేతిలో డ‌బ్బులు పెట్టే ఆఫ‌ర్ ప్ర‌క‌టించింది. ఈనెల ఐదు, ఆరో తేదీల్లో ఆ హోట‌ల్‌లో 25 పరోటాలు తింటే రూ.5,001 న‌జ‌రానా పొంద‌వ‌చ్చని పేర్కొంది. దీనికి ప‌రోటా ప్రియుల నుంచి భారీ ఎత్తున స్పంద‌న వ‌స్తోంది. పోటీలో పాల్గొనడానికి ఇప్ప‌టికే రెండు వేల మంది ప్ర‌జ‌లు మొబైల్‌ ద్వారా, 200 మంది నేరుగా హోట‌ల్‌కు వ‌చ్చి త‌మ పేర్ల‌ను న‌మోదు చేసుకున్నారు. పోటీల‌ను సాయంత్రం 6 గంట‌ల నుంచి రాత్రి 11గంట‌ల వ‌ర‌కు నిర్వ‌హించ‌నున్న‌ట్లు హోట‌ల్ యాజ‌మాన్యం తెలిపింది. ఎంత‌మంది 25 పరోటాలు లాగించేసి రూ.5,001 గెలుపొందుతారో చూడాల్సిందే!

  • Loading...

More Telugu News