: ఆప్ నుంచి సందీప్ బహిష్కరణ!... ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేసిన పార్టీ!
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కేబినెట్ లో కీలక శాఖ మంత్రిగా ఉండి, ఏకకాలంలో ఇద్దరు మహిళలతో సరసాలు సాగించి కెమేరాకు దొరికిపోయిన సందీప్ కుమార్ పదవి ఊడిన సంగతి విదితమే. సందీప్ కుమార్ సీడీ నేరుగా కేజ్రీ చేతికి చేరగా... ఆ మరుక్షణమే ఆయనను మంత్రి పదవి నుంచి తొలగించారు. తాజాగా సందీప్ ను ఆప్ నుంచి బహిష్కరిస్తూ కేజ్రీ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు సందీప్ ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్లు ఆప్ ప్రకటించింది.