: తెలుగు రాష్ట్రాలకు వర్షసూచన
తెలుగు రాష్ట్రాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. మరో రెండు రోజుల వరకు తెలంగాణ, కోస్తాంధ్రలో ఇదే పరిస్థితి ఉంటుందని పేర్కొంది. రాయలసీమలో రెండు రోజుల తరువాత కూడా వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశాలు లేవని చెప్పింది. ఒడిశా నుంచి కోస్తాంధ్ర మీదుగా దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి ఏర్పడిందని, దీని ప్రభావంతోనే వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలిపింది.