: చిరంజీవి సినిమాలు అంటే ఇష్టం... కానీ ఆయనతో సినిమా మాత్రం తీయలేను: శ్రీనివాస్ అవసరాల
మెగాస్టార్ చిరంజీవి సినిమాలంటే తనకు ఇష్టమని నటుడు, దర్శకుడు శ్రీనివాస్ అవసరాల చెప్పాడు. 'జ్యో అచ్యుతానంద' సినిమా ప్రమోషన్ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్కూల్ రోజుల్లో 'గ్యాంగ్ లీడర్', 'ఘరానా మొగుడు' వంటి సినిమాలను క్వార్టియర్లీ, హాఫియర్లీ పరీక్షలు ఎగ్గొట్టి మరీ చూశానని తెలిపాడు. ఆయనంటే అంత ఇష్టమని చెప్పారు. అయితే ఆయనతో కలిసి సినిమా తీయనని అన్నాడు. ఆయనను తెరపై చూడడం వేరు, ఆయనను తెరపై చూపించడం వేరని చెప్పాడు. అంత హీరోయిక్ గా తాను సినిమాలు తీయలేనని ఆయన స్పష్టం చేశాడు. చిరంజీవి అంత స్టార్ ను తాను హేండిల్ చేయలేనని నిజాయతీగా ఒప్పుకుంటున్నానని ఆయన తెలిపాడు.