: సీక్రెట్ గా ప్రియురాలిని కలిసిన కోహ్లీ


క్రికెటర్ విరాట్ కోహ్లీ తన ప్రియురాలు, బాలీవుడ్ భామ అనుష్క శర్మను కలవడానికి చెక్ రాజధాని ప్రేగ్ కు వెళ్లాడు. 'ద రింగ్' సినిమా షూటింగ్ లో భాగంగా అనుష్క శర్మ ప్రస్తుతం అక్కడ ఉంది. దీంతో టీ20 సిరీస్ ముగిసిన అనంతరం కోహ్లీ రహస్యంగా ప్రేగ్ వెళ్లాడు. అయితే కోహ్లీ వీరాభిమాని ఒకరు అతని వెంట పడి సెల్పీ తీసుకున్నాడు. దానిని ఫేస్ బుక్ లో పోస్ట్ చేశాడు. ఈ సెల్ఫీలో వారిద్దరి వెనుక అనుష్క కూడా వుంది.

  • Loading...

More Telugu News