: భార్యతో బ్యాటింగ్ కు దిగితే... నాన్ స్ట్రయికర్ ఎండ్ అయితే బెటర్!: సెహ్వాగ్ ట్వీట్


భారత ఒలింపిక్ సంబరాలపై హేళన చేసిన బ్రిటిష్ జర్నలిస్టుకు కౌంటర్ ట్వీట్ తో సమాధానం చెప్పిన సెహ్వాగ్ కు అభిమానులు పెరిగారు. ఈ సందర్భంగా తన ట్వీట్ తో సెహ్వాగ్ మరోసారి అందర్నీ అలరించాడు. సచిన్, గంభీర్ తో కలిసి ఓపెనింగ్ చేసిన వీరూ టీమిండియాకు ఎన్నో విజయాలు అందించాడు. అలాంటి వీరూ తన భార్యతో కలిసి ఓపెనింగ్ చేయాల్సి వస్తే... టీమిండియాలోలా కాకుండా నాన్ స్ట్రయికర్ ఎండ్ ను ఎంచుకుంటానని తెలిపాడు. భార్యతో ఆడితే కనుక నాన్ స్ట్రయికర్ ఎండ్ లోనే ఉండాలని అన్నాడు. ఆమెను మాట్లాడనిస్తూ ఉండాలని సూచించాడు. అవసరమైనప్పుడు ఆమె రన్ తీస్తుందని జోక్ చేశాడు. ఈ ట్వీట్ అభిమానులను ఆకట్టుకుంటోంది.

  • Loading...

More Telugu News