: రేపు ఇందిరాపార్క్ వద్ద నిరాహార దీక్ష మొదలు: డీకే అరుణ


గద్వాలను ప్రత్యేక జిల్లాగా ప్రకటించాలని చాలా కాలంగా డిమాండ్ చేస్తున్న కాంగ్రెస్ మహిళా నేత, మాజీ మంత్రి డీకే అరుణ, తన డిమాండ్ సాధన కోసం నిరాహార దీక్ష చేపట్టాలని నిర్ణయించుకున్నారు. రేపటి నుంచి ఇందిరా పార్క్ వద్ద రెండు రోజుల పాటు నిరాహార దీక్ష చేయనున్నట్టు ఆమె వెల్లడించారు. శని, ఆదివారాల్లో తన దీక్ష కొనసాగుతుందని, అప్పటికీ ప్రభుత్వం దిగిరాకుంటే మరింతగా ఉద్యమిస్తామని అన్నారు. ప్రత్యేక జిల్లాల ముసాయిదా పూర్తి అశాస్త్రీయమని, కేసీఆర్ తన ఇష్టప్రకారం గీతలు గీసుకున్నట్టు ఉందని అన్నారు. గద్వాల, జనగామ ప్రాంతాలను జిల్లాలుగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News