: సచిన్ కే పాఠాలు నేర్పిన బాల క్రికెటర్
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కే ఒక బాల క్రికెటర్ పాఠాలు నేర్పాడు. తనదైన శైలిలో టిప్స్ కూడా ఇచ్చాడు. ఈ విషయాన్ని స్వయంగా సచినే తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నాడు. ‘మీ దృష్టి బంతిపైనే పెట్టండి’ అంటూ ఆ బాల క్రికెటర్ చెప్పడంతో ఆశ్చర్యపోవడం తన వంతైందని సచిన్ పేర్కొన్నాడు. ఈ ట్వీట్ తో పాటు చిన్నారితో కలిసి ఉన్న ఒక ఫొటోను కూడా సచిన్ పోస్ట్ చేశాడు. అయితే, ఈ సంఘటన ఎక్కడ జరిగింది, ఎవరా పిల్లాడనే విషయాలను మాత్రం మాస్టర్ బ్లాస్టర్ ప్రస్తావించలేదు.