: అడ్డంగా దొరికి ఇంత నిస్సిగ్గు ప్రశ్నలా?: బాబుపై రోజా నిప్పులు
కోట్ల రూపాయలు వెచ్చించి ప్రజా ప్రతినిధులను కొనాలని చూసి దొరికిపోయిన చంద్రబాబు, సిగ్గుపడాల్సింది పోయి, తన గొంతును ఎలా రికార్డు చేశారని ఎదురు ప్రశ్నలు వేస్తున్నారని వైకాపా నేత, నగరి ఎమ్మెల్యే రోజా నిప్పులు చెరిగారు. తన గొంతును ఎందుకు రికార్డు చేశారన్న ప్రశ్నలోనే అది తన గొంతేనన్న సమాధానం కూడా ఉందని, ఆయనకు శిక్ష పడాలా? వద్దా? అన్నది కోర్టులే తేలుస్తాయని అన్నారు. తాను ఎలాంటి తప్పూ చేయకున్నా, సంవత్సరం పాటు అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారని ఆరోపించారు. అదే అసెంబ్లీలో రౌడీల మాదిరిగా ప్రవర్తించిన బొండా ఉమ, అచ్చెన్నాయుడులను వదిలివేశారని, ఎమ్మార్వోపై చేయి చేసుకున్న చింతమనేనినీ ఏమీ అనలేదని అన్నారు. తన ఎమ్మెల్యేలు తప్పుల మీద తప్పులు చేస్తుంటే, చంద్రబాబు నిస్సిగ్గుగా, కోర్టుల అండతో తప్పులు కప్పిపుచ్చుకుంటున్నారని విమర్శించారు.