: హైదరాబాద్ కొత్తపేటలో సందడి చేసిన రాశీఖన్నా
హైదరాబాద్ కొత్తపేటలో ఒక షాపు ప్రారంభోత్సవానికి వచ్చిన సినీనటి రాశీఖన్నా సందడి చేసింది. కొత్తపేట చౌరస్తా సమీపంలోని అష్టలక్ష్మి కమాన్ ఎదురుగా ఆర్ఎస్ బ్రదర్స్ నూతన షోరూమ్ ను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా రాశీఖన్నాను చూసేందుకు అభిమానులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఆమెతో సెల్ఫీలు దిగేందుకు అభిమానులు ఆసక్తి కనపరిచారు.