: బైక్ పై స్నేహితురాలితో ఫీట్స్ చేస్తూ, ప్రమాదం జరిగితే నిర్దయగా వదిలేసి వెళ్లిన యువకుడు!


బెంగళూరు నగర వీధుల్లో తన స్నేహితురాలిని వెనక ఎక్కించుకుని ఫీట్స్ చేస్తున్న యువకుడి బైక్ అదుపుతప్పగా, కిందపడిన ఆమె పరిస్థితి ఏంటని కూడా చూడకుండా నిర్దయగా వెళ్లిపోయాడో యువకుడు. ఈ ఘటన నిన్న రాత్రి మద్రాస్ రోడ్డులో జరిగింది. మరిన్ని వివరాల్లోకి వెళితే, ఎంతో మంది స్థానికులు చూస్తుండగా, హైఎండ్ బైక్ పై వచ్చిన ఆ యువకుడు విన్యాసాలు చేస్తూ ముందుకు సాగాడు. ఈ క్రమంలో బైక్ అదుపుతప్పి ఆ అమ్మాయి కిందపడిపోయింది. ఆ వెంటనే వెనకే వస్తున్న మరో వాహనం ఆమెపై నుంచి ఎక్కింది. సదరు యువకుడు బైక్ తీసుకుని పరారయ్యాడు. స్థానికులు స్పందించి ఆ యువతిని ఆసుపత్రికి తీసుకువెళ్లేసరికే ప్రాణాలు కోల్పోయాయి. ఆమె పేరు షైనీ కిరణ్ అని, బైక్ పై వచ్చిన యువకుడికి 17 సంవత్సరాల వయసు ఉంటుందని చెప్పిన పోలీసులు, కేసును నమోదు చేశామని, అతన్ని గుర్తించి, అరెస్ట్ చేసేందుకు గాలిస్తున్నామని తెలిపారు.

  • Loading...

More Telugu News