: నయీమ్ అనుచరుడు అసిఫ్ అరెస్ట్!... కోరుట్లలో పట్టేసిన సిట్!
గ్యాంగ్ స్టర్ నయీమ్ అనుచరుల కోసం సిట్ అధికారులు రెండు తెలుగు రాష్ట్రాలను జల్లెడ పడుతున్నారు. ఇప్పటికే నల్లగొండ జిల్లాలో నయీమ్ అనుచరులుగా ఉన్న పలువురిని అదుపులోకి తీసుకున్న సిట్... నేటి ఉదయం హైదరాబాదులోని కుషాయిగూడలో అతడి అనుచరులు శ్రీనివాస్, లక్ష్మణ్ లను అరెస్ట్ చేసింది. ఇక కరీంనగర్ జిల్లాకు వెళ్లిన సిట్ కు చెందిన మరో బృందం... ఆ జిల్లాలోని కోరుట్లలో నయీమ్ ప్రధాన అనుచరుడిగా భావిస్తున్న అసిఫ్ ను పట్టేసింది. నయీమ్ ఎన్ కౌంటర్ అనంతరం దాదాపుగా అండర్ గ్రౌండ్ కు వెళ్లిపోయిన అసిఫ్ పోలీసుల కళ్లు గప్పి తిరుగుతున్నాడు. అయితే అతడికి సంబంధించిన కీలక సమాచారాన్ని రాబట్టిన సిట్ అతడిని అరెస్ట్ చేసింది.