: ఉండవల్లి రాజకీయాల్లో లేరట!... ఏ పార్టీలోనూ కూడా లేనంటూ ప్రకటన!


ఏపీ రాజకీయాల్లో సీనియర్ నేతగా ఉన్న రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రస్తుతం రాజకీయాల్లోనే లేరట. ఈ మేరకు కొద్దిసేపటి క్రితం ఆయనే స్వయంగా ఓ ప్రకటన చేశారు. ప్రస్తుతం తాను ఏ పార్టీలోనూ లేనని ప్రకటించిన ఉండవల్లి... వ్యక్తిగత అంశాలపై తనకు మెసేజ్ లు ఏమీ పెట్టొద్దని ఆయన రాజకీయ నేతలకు సూచించారు. ఈ మేరకు తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో కొద్దిసేపటి క్రితం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీడీపీ నేత, ఏపీ మంత్రి నారాయణ తనకు శత్రువేమీ కాదని కూడా ఆయన పేర్కొనడం గమనార్హం.

  • Loading...

More Telugu News