: విజయవాడలో పవన్ కల్యాణ్, బొండా ఉమ చిత్రాలతో ప్లెక్సీలు... టీడీపీలో చర్చ!
పవన్ కల్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా తెలుగుదేశం ఎమ్మెల్యే బొండా ఉమ అభినందనలు తెలుపుతున్నట్టు విజయవాడలో వెలసిన ప్లెక్సీలు కలకలం రేపుతున్నాయి. బొండా ఉమ, పవన్ చిత్రాలు ఈ ప్లెక్సీలపై ఉండటంతో ఇది తెలుగుదేశం పార్టీలో చర్చనీయాంశమైంది. టీడీపీ గుర్తుగానీ, చంద్రబాబు ఫోటోలుగానీ లేకుండా ఉన్న ఈ ప్లెక్సీలపై పార్టీ కార్యకర్తలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదాను సాధించేందుకు నేతలు ప్రయత్నించడం లేదని తిరుపతి సభలో పవన్ తీవ్ర విమర్శలు కురిపించడం, ఆపై టీజీ వెంకటేశ్, బొండాల మధ్య నడిచిన విమర్శనాస్త్రాల నేపథ్యంలో ఈ ప్లెక్సీలు కనిపించడం గమనార్హం.