: ఏపీలో ’పురపాలక’ పోరుకు సర్వం సిద్ధం!... డిసెంబర్ లోగా ఎన్నికలన్న మంత్రి నారాయణ!
నవ్యాంధ్రలో మరో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైపోయింది. రాష్ట్రంలోని 11 నగరపాలక సంస్థలకు ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ నిన్న తిరుపతిలో ప్రకటించారు. నవంబర్, డిసెంబర్ మాసాల్లో కార్పొరేషన్ ఎన్నికలను పూర్తి చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే ఆయా నగరపాలక సంస్థల్లో ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేశామని చెప్పిన ఆయన... త్వరలోనే ఎన్నికల నోటిఫికేషన్ ను జారీ చేయనున్నట్లు ప్రకటించారు.