: వైఎస్ ఏడో వర్ధంతి నేడు!... ఇడుపులపాయలో తండ్రికి జగన్ నివాళి!


వైఎస్ రాజశేఖరరెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయి అప్పుడే ఏడేళ్లు గడిచిపోయాయి. 2009 సెప్టెంబర్ 2న చిత్తూరు జిల్లాలో రచ్చబండ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు హైదరాబాదు నుంచి హెలికాప్టర్ లో బయలుదేరిన వైఎస్... నల్లమల అడవుల్లోని పావురాలగుట్ట వద్ద చోటుచేసుకున్న ప్రమాదంలో చనిపోయిన సంగతి తెలిసిందే. నేడు ఆయన ఏడో వర్ధంతి సందర్భంగా వైసీపీ శ్రేణులు ఆయనకు అశ్రునివాళి అర్పిస్తున్నాయి. వైఎస్ వర్ధంతి నేపథ్యంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిన్న రాత్రికే బెంగళూరు మీదుగా కడప జిల్లా పులివెందుల చేరుకున్నారు. కొద్దిసేపటి క్రితం ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి ఇడుపులపాయలోని తన తండ్రి సమాధి వద్దకు చేరుకుని నివాళి అర్పించారు. రేపు కూడా జగన్ కడప జిల్లాలోనే పర్యటించనున్నారు.

  • Loading...

More Telugu News