: ఆ రోజు బాలయ్య కారులో ఉన్నదెవరు? పారిపోయిందెందుకు?


బుధవారం తెల్లవారుఝామున వేగంగా దూసుకువస్తూ అదుపుతప్పి బీభత్సం సృష్టించిన సినీ హీరో, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఫార్చ్యూనర్ కారు (ఏపీ 02 ఏవై 0001) నడుపుతున్నది ఎవరు? అతనెందుకు పోలీసులకు లొంగిపోకుండా పారిపోయాడు? అన్న విషయాలపై పోలీసులు దృష్టిని సారించారు. కారు ప్రమాదం తరువాత ఓ వ్యక్తి కారు దిగి, రోడ్డుకు అవతలి వైపునకు నడిచి ఆటో ఎక్కి వెళ్లిపోయాడని అక్కడే ఫుట్ పాత్ పై ఉన్న కొందరు సాక్ష్యం చెప్పడంతో అతనెవరన్న విషయమై పోలీసులు విచారణ మొదలు పెట్టారు. కారును బంజారాహిల్స్ పోలీసు స్టేషన్ కు తరలించిన పోలీసులు, సమీపంలోని సీసీ కెమెరాలన్నీ పరిశీలిస్తున్నట్టు తెలిపారు. కారుకు సంబంధించి ఫిర్యాదు చేసేందుకు ఇంతవరకూ ఎవరూ రాకపోవడం, కారు బాలకృష్ణ పేరిట రిజిస్టరై ఉండటంతో ఆయన మేనేజర్ ను పిలిచి విచారిస్తామని పోలీసు వర్గాలు వెల్లడించాయి. కాగా, బంజారాహిల్స్ అగ్రసేన్ భవనం వైపు నుంచి క్యాన్సర్ ఆసుపత్రి వైపు వేగంగా వచ్చిన ఈ కారు అదుపుతప్పి డివైడర్ ను ఢీకొన్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News