: అందరి దృష్టి హైకోర్టు వైపే!... చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై విచారణ నేడే!


ఓటుకు నోటు కేసును పునర్విచారించి సమగ్ర నివేదిక అందించాలన్న తెలంగాణ ఏసీబీ ప్రత్యేక కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సవాల్ చేశారు. ఇప్పటికే ఈ కేసులో దర్యాప్తు పూర్తి చేసి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసిన తర్వాత ఈ కేసులో పునర్విచారణ అవసరం ఏముందని తన క్వాష్ పిటిషన్ లో ఏసీబీ ప్రత్యేక కోర్టు నిర్ణయాన్ని బాబు ప్రశ్నించారు. పునర్విచారణ చేయాలని పిటిషన్ దాఖలు చేసిన వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి కేసుతో ఎలాంటి సంబంధం లేదని, కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఈ పిటిషన్ దాఖలైందని సదరు పిటిషన్ లో చంద్రబాబు పేర్కొన్నారు. నిన్న మధ్యాహ్నం భోజన విరామం తర్వాత తన ముందుకు వచ్చిన ఈ పిటిషన్ ను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎంఎస్కే జైస్వాల్ విచారణకు స్వీకరించారు. తదుపరి విచారణను నేటి (శుక్రవారం)కి వాయిదా వేశారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై కోర్టు ఎలా స్పందిస్తుందన్న విషయంలో తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తి నెలకొంది.

  • Loading...

More Telugu News