: 'మాణిక్ చంద్' యజమానిపై సీబీఐ కేసు
కరుడుగట్టిన మాఫియా డాన్, 1993 ముంబై పేలుళ్ల సూత్రధారి దావూద్ ఇబ్రహీం, ప్రముఖ గుట్కా కంపెనీ మాణిక్ చంద్ యజమాని ఆర్ఎం ధరీవాల్ పై సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసింది. దుబాయ్ లో నిషేధం ఉన్నప్పటికీ ధరీవాల్ తయారు చేసే గుట్కాను దావూద్ కు చెందిన కంపెనీ ద్వారా అక్రమంగా తరలించారనే ఆరోపణలతో వీరిపై ఢిల్లీ హైకోర్టులో సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసింది. దీంతో 60 ఏళ్ల చరిత్ర కలిగిన మాణిక్ చంద్ సంస్థపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని వ్యాపార నిపుణులు పేర్కొంటున్నారు.