: అమెరికాలో 'జనతా గ్యారేజ్' తొలి రోజు కలెక్షన్లు అదుర్స్


ప్రపంచవ్యాప్తంగా రెండువేలకుపైగా థియేటర్లలో రిలీజైన 'జనతా గ్యారేజ్‌' కేవలం భారత్ లోనే కాకుండా అమెరికాలో కూడా దుమ్మురేపుతోందని ప్రముఖ సినీ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ తెలిపాడు. ఈ విషయం ట్విట్టర్ ద్వారా ఆయన తెలిపాడు. వారం మధ్యలో (బుధవారం) విడుదలైనా 'జనతా గ్యారేజ్‌' అగ్రరాజ్యంలో అద్భుతంగా ఆడుతోందని, హిందీ పెద్ద సినిమాలను తలదన్నేలా ఈ సినిమాకు కలెక్షన్లు వస్తున్నాయని తరణ్ ఆదర్శ్ వెల్లడించాడు. కలెక్షన్ల వివరాలు అన్నీ సేకరించిన తరువాత మళ్లీ ట్వీట్ చేస్తానని ఆయన తెలిపాడు. దీంతో యూఎస్ లో టాప్ టూ కలెక్షన్లు సాధించిన సినిమాగా ఉన్న 'సర్దార్ గబ్బర్ సింగ్' సినిమా కలెక్షన్లను 'జనతా గ్యారేజ్' దాటేలా ఉందని జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News