: కేసుల్లో స్టే తెచ్చుకోవడం చంద్రబాబుకి అలవాటే!: రఘువీరారెడ్డి
ఓటుకు నోటు కేసు విషయంలో చంద్రబాబు నాయుడు హైకోర్టుకి వెళ్లడంపై ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి స్పందించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ... కేసుల్లో స్టే తెచ్చుకోవడం చంద్రబాబుకి అలవాటేనని వ్యాఖ్యానించారు. కేసులో ముమ్మరంగా దర్యాప్తు జరగాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందంటూ కేంద్ర కార్మిక సంఘాలు రేపు నిర్వహించతలపెట్టిన బంద్‌కు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఉంటుందని రఘువీరారెడ్డి పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా విషయంలో మరోసారి మోసం చేసే ప్రయత్నం చేస్తోందని ఆయన ఆరోపించారు.