: ‘పులిచింతల’కు జలకళ.. 47 మీటర్లకు చేరిన నీటిమట్టం
పులిచింతల ప్రాజెక్ట్ జలకళతో ఉట్టిపడుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి వరదనీరు వచ్చి చేరుతోంది. ‘పులిచింతల’ నీటిమట్టం ప్రస్తుతం 47 మీటర్లకు చేరగా, 50 మీటర్ల వరకు నిల్వ చేయాలని అధికారులు నిర్ణయించారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 13 వేల క్యూసెక్కుల నీటి ప్రవాహం కొనసాగుతోంది. నీటినిల్వ మాత్రం 15 టీఎంసీలకు చేరుకుంది. ప్రాజెక్టులో నీటిమట్టం పెరుగుతుండటంతో తెలంగాణలోని రెండు గ్రామాల్లోకి నీరు చేరుతుండటంతో, ఆయా గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ప్రాజెక్టు వద్ద పరిస్థితిని కృష్ణా డెల్టా ప్రాజెక్టుల సీఈ వైఎస్ సుధాకర్, డ్యామ్ భద్రతా నిపుణులు సమీక్షిస్తున్నట్లు సమాచారం.