: 'సుష్మా గారూ, నా భర్త ప్రియురాలి గురించి చెప్పండి' అన్న యువతి... చేతులెత్తేసిన కేంద్ర మంత్రి


ఎవరైనా విదేశాల్లో ఇబ్బందులు పడుతూ, పాస్ పోర్టులు పోగొట్టుకుని బాధపడుతూ తనకు ట్వీట్లు చేసే వారి సమస్యలపై తక్షణం స్పందించే విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, తాను తీర్చలేని సమస్య ఎదురైన వేళ చేతులెత్తేశారు. ఇంతకీ విషయం ఏంటంటే, తన భర్త ఓ థాయ్ ల్యాండ్ అమ్మాయితో ప్రేమాయణం సాగిస్తున్నాడని, భర్తతో కలసి తాను ఇండియాకు వచ్చిన వేళ, ఆ అమ్మాయి కూడా వచ్చిందని తనకు తెలిసిందని చెప్పిన సుజాత అనే యువతి, ఆమె ఎవరో తెలుసుకునేందుకు సాయపడాలని తన ట్విట్టర్ ఖాతా ద్వారా సుష్మా స్వరాజ్ ను అభ్యర్థించింది. దీనిపై స్పందించిన సుష్మా, "సుజాతా... నా సానుభూతి నీపై ఉంటుంది. దురదృష్టవశాత్తూ, ఈ తరహా భర్తలను శిక్షించేందుకు లేదా సంస్కరించేందుకు నాకు ఎలాంటి అధికారాలు లేవు. నీకు సాయపడలేను" అని రీట్వీట్ చేశారు.

  • Loading...

More Telugu News