: నిజాం షుగర్ ఫ్యాక్టరీని భ్రష్టు పట్టించింది చంద్రబాబు నాయుడే!: ఎంపీ కవిత
నిజాం షుగర్ ఫ్యాక్టరీని భ్రష్టు పట్టించింది చంద్రబాబు నాయుడేనని టీఆర్ఎస్ ఎంపీ కవిత ఆరోపించారు. ఈరోజు హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ... ఆ ఫ్యాక్టరీకి పూర్వ వైభవం తీసుకొస్తామని చెప్పారు. చంద్రబాబు నాయుడు 2002లో ఆ ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం చేశారని, కొన్ని సంవత్సరాల తరువాత వరుసగా నిజాం షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం నష్టాలు చూపించిందని ఆమె అన్నారు. చెరుకు ఉత్పత్తి ఉన్నా నష్టాల్లో చూపారని ఆమె ఆరోపించారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణకు తాము సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. ప్యాక్టరీని తెలంగాణ ప్రభుత్వం వారసత్వ సంపదగా భావిస్తోందని చెప్పారు. 2014 నుంచి ఇప్పటివరకు తాము రైతులకు రూ.66 కోట్ల బకాయిలు చెల్లించినట్లు తెలిపారు.