: రూ. 2,999కి సూపర్ అఫర్డబుల్ 4జీ ఫోన్: ముఖేష్ అంబానీ


దేశంలోని దిగువ వర్గాల ప్రజలు కూడా నాణ్యమైన 4జీ తరంగాల సేవలను అందుకోవాలన్న ఉద్దేశంతోనే కేవలం రూ. 2,999కి సూపర్ అఫర్డబుల్ 4జీ ఎల్టీఈ ఫోన్ ను అందించాలని నిర్ణయించామని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ప్రకటించారు. తక్కువ ధర ఫోన్లు అందుబాటులోకి వస్తే, ఫీచర్ ఫోన్లను వాడుతున్న కోట్లాది మంది స్మార్ట్ ఫోన్లకు అప్ గ్రేడ్ అవుతారని అభిప్రాయపడ్డ ఆయన, తాము విక్రయిస్తున్న ఫోన్లలో 70 శాతం వరకూ 4జీ కంపాటబిలిటీ ఉన్నవేనని వివరించారు. రిలయన్స్ జియో ఏ పర్వదినం లేదా నూతన సంవత్సరం, వాలంటైన్స్ డే, ఇండిపెండెన్స్ డే తదితర దినాల్లో 'బ్లాకౌట్'ను ప్రకటించబోదని, సిగ్నల్స్ బిజీగా ఉండే రోజుల్లో ధరలను పెంచబోదని ఆయన ప్రకటించారు. ఎంత అధిక డేటాను వాడుతుంటే, అంత తక్కువ ధరకు డేటా లభిస్తుందని అన్నారు.

  • Loading...

More Telugu News