: హరీశ్‌రావుకి కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి లేఖ.. నిధులు ఇచ్చేందుకు గ్రీన్‌సిగ్నల్
రైతులకు నీరివ్వడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన 'ప్రధాన మంత్రి కృషి సించాయ్ యోజన' పథకం అంశంపై తెలంగాణ భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావుకి కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి లేఖ రాశారు. రాష్ట్రంలో పథకాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు నిధులు ఇచ్చేందుకు ఆ లేఖలో అంగీకారం తెలిపారు. దీనికి సంబంధించి ఈనెల 6న నాబార్డుతో ప్రభుత్వం ఒప్పందం చేసుకోవాల్సి ఉంటుందని ఆమె లేఖలో సూచించారు. ఒప్పంద కార్యక్రమానికి హాజరుకావాలని హరీశ్‌రావుని ఉమాభారతి కోరారు.